Lyrics

ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే అరెరే నా జగమంటూ నీ సగమంటూ వేరుగ లేదంటే అదిరే గుండెల చుట్టూ కావలి కాస్తూ ఊపిరినివ్వాలే ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే తెలియదుగా తెగ తొందర చేసిన వయసుకి అసలు కథ ఒక మాటని పలకని పెదవుల ఎదురుగ కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే మనసులు మళ్ళీ మళ్ళీ లొంగిపోవాలే లేనిపోని ఆటలేమిటో నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే అరె' ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే గడవదుగా ఒక నిమిషము గుండెకు నీ సడి వినపడక నిను వెతికిన తలపులు అలసిన క్షణమిక నన్ను కొట్టి ఆడుకోమాకే ఉన్నట్టుండి నన్నే వీడి వెళ్ళిపోమాకే నీలో నేనే ఉన్నట్టున్నానే తొంగిచూడు నువ్వేలేని నేనై ఉంటానే అరె' ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే అరెరే నా జగమంటూ నీ సగమంటూ వేరుగ లేదంటే అదిరే గుండెల చుట్టూ కావలి కాస్తూ ఊపిరినివ్వాలే ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
Writer(s): Praveen Lakkaraju, Sreejo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out