Featured In

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Acharya Athreya
Acharya Athreya
Songwriter

Lyrics

అరే ఏమైందీ అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దుర లేపిందీ అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది పూలునేను చూడలేను పూజలేవి చేయలేను నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో లలలల లా లలలల లా లలలల లా లలలల లా లలలల లా లల లల లల లల లల లలలా బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతుతానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చిచూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది అరే ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ
Writer(s): Ilayaraja, Acharya Atreya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out